నన్ను హీరోని చేసింది ఆయనే – సుమన్తెలుగు సినిమాకు లెజెండరీ దర్శకులను అందించిన ప్రముఖ నిర్మాత కోటిపల్లి రాఘవ ఈ రోజు ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. కాగా పలువురు సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఒకప్పటి హీరో సుమన్‌ కోటిపల్లి రాఘవగారితో తనకున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు.

సుమన్‌ మాట్లాడుతూ.. ‘నన్ను హీరోగా పరిచయం చేసింది కోటిపల్లి రాఘవగారే. ఆయన నన్ను హీరోని చెయ్యడమే కాదు, ఓ కొడుకులా చూసుకున్నారు. నా కెరీర్ బిగినింగ్ లో ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. ప్రతాప్ ఆర్ట్స్ లో ఆయన నిర్మించిన తరంగిణి చిత్రం వెయ్యి రోజుల పాటు ఆడి చరిత్ర సృష్టించింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమ మద్రాస్ నుండి హైదరాబాద్‌ కు తరలి రావడంలో కోటిపల్లి రాఘవగారి ఎంతో ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది’ అని సుమన్ తెలిపారు.