తెలుగు చిత్ర పరిశ్రమపై సుమన్ కీలక వ్యాఖ్యలు..!

Published on May 31, 2022 1:30 am IST

తెలుగు చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని సీనియర్‌ నటుడు సుమన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు దర్శకరత్న దాసరి నారాయణరావు వర్థంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ నిర్వహించిన ఓ కార్యక్రమానికి టాలీవుడ్‌ ప్రముఖులతో పాటు నటుడు సుమన్‌ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో క్రమశిక్షణ లేదని, మేకర్స్ వల్ల బయ్యర్స్ సంతోషంగా ఉండడంలేదని అన్నారు.

ప్రస్తుత నిర్మాతలు బయ్యర్స్‌ గురించి ఆలోచించడం లేదని, మేకర్స్‌ వల్ల బయ్యర్స్‌ నష్టపోతున్నారని అన్నారు. కోట్టకు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకంతో బయ్యర్స్‌ కొంటున్నారు. ఒకవేళ ఆ సినిమా ప్లాప్‌ అయితే నష్టపోయేది బయ్యర్స్ అని అన్నారు. సినిమా షూటింగ్స్‌లో సమయపాలన అసలు ఉండడంలేదని, నిర్మాతకు అదనపు భారం కలిగేలా మేకర్స్‌ ఉన్నారని అన్నారు. దీంతో సుమన్‌ చేసిన ఈ కామెంట్స్‌ ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశమయ్యాయి.

సంబంధిత సమాచారం :