డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తో సుమంత్ “అనగనగా”

డైరెక్ట్ ఓటిటి రిలీజ్ తో సుమంత్ “అనగనగా”

Published on Feb 9, 2025 2:00 PM IST

అక్కినేని కాంపౌండ్ నుంచి మన తెలుగు సినిమాకి పరిచయం అయ్యిన టాలెంటెడ్ హీరోస్ లో హ్యాండ్సమ్ హీరో సుమంత్ కూడా ఒకరు. మరి సుమంత్ హీరోగా కంబ్యాక్ ఇచ్చిన తర్వాత మరిన్ని సినిమాలు చేస్తుండగా తన నుంచి ఇపుడు ఓ సినిమా నేరుగా ఓటిటిలో రిలీజ్ కి సిద్ధం అయ్యింది. నేడు సుమంత్ బర్త్ డే కానుకగా “అనగనగా” అనే చిత్రాన్ని మేకర్స్ అనౌన్స్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు.

మరి ఇందులో సుమంత్ తన ఫామిలీతో కనిపిస్తుండగా ఒక బ్యూటిఫుల్ ఫామిలీ డ్రామాతో తాను రాబోతున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే దర్శకుడు సన్నీ సంజయ్ తెరకెక్కిస్తుండగా కాజల్ చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. మరి సినిమాని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు తమ ఒరిజినల్ సినిమాగా డైరెక్ట్ స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని కృషి ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించగా డేట్ ఇంకా బయటకి రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు