సుమంత్ అశ్విన్ నెక్స్ట్ సినిమా టైటిల్ ‘చక్కిలి గింత’.!

Sumanth_Ashwin
‘అంతకముందు ఆ తరువాత’, ‘లవర్స్’ సినిమాలతో విజయం అందుకున్న సుమంత్ అశ్విన్ ప్రస్తుతం మరో కొత్త సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సుకుమార్ స్నేహితుడైన వేమారెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇప్పటి వరకూ 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

నరసింహా రెడ్డి – నరసింహాచారి కలిసిమహి ఎంటర్ టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో సుమంత్ అశ్విన్ సరసన మృతిక హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాకి ఈ చిత్ర టీం ‘చక్కిలి గింత’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. రొమాంటిక్ ఎంటర్టైనర్ కి ఇలాంటి టైటిల్ బాగానే సరిపోతుంది. మరి ఇప్పటి వరకూ రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో హిట్స్ అందుకున్న సుమంత్ అశ్విన్ ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటాడేమో చూడాలి..

Exit mobile version