కేరింత విజయానందంలో సుమంత్ అశ్విన్

Sumanth-Ashwin
టాలీవుడ్ లో విజయవంతమైన నిర్మాతలలో ఒకరైన ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమా విజయంతో ప్రేక్షకులకు చేరువయ్యాడు. తూనీగ తూనీగ సినిమా నుండి నిన్నటి కేరింత వరకూ వరుసపెట్టి లవర్ బాయ్ ఇమేజ్ వున్న పాత్రలు చేస్తూ యువతకు దగ్గరవుతున్నాడు.

దిల్ రాజు నిర్మాణంలో, సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో మిక్కీ జె మేయర్ సంగీతం తోడయ్యి విడుదలైన కేరింత యువతను ఆకట్టుకుంది, ఈ సినిమాలో సుమంత్ నటన కెరీర్ బెస్ట్ గా నిలవడమే కాక తనకి సైతం కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని అందించాయి. ప్రస్తుతం మన యువ హీరో ఈ చిత్రం అందించిన విజయానందంలో వున్నాడు. సుమంత్ జన్మదినం సందర్భంగా 123 తెలుగు అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేస్తుంది.

Exit mobile version