రెండో పెళ్లీపై క్లారిటీ ఇచ్చిన హీరో సుమంత్..!

Published on Jul 29, 2021 8:30 pm IST

అక్కినేని మేనల్లుడు సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రచారానికి గల కారణం ఏంటంటే ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఉన్న ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు రావడమే. అయితే నిన్న సుమంత్ రెండో పెళ్లిపై దర్శకుడు ఆర్జీవీ కూడా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

అయితే తాజాగా తన రెండో పెళ్లి వార్తలపై సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. నేను అసలు రెండో పెళ్లి చేసుకోవడంలేదని, బయట సర్క్యులేట్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ నేను నటిస్తున్న ఓ లేటెస్ట్ చిత్రంలోనిదని, అది లీక్ కావడం వలనే తన రెండో పెళ్లిపై రూమర్స్ పుట్టుకొచ్చాయని అన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తామని సుమంత్ చెప్పుకొచ్చాడు.

సంబంధిత సమాచారం :