ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : సుమంత్ – ప్రస్తుతం నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్స్ కూడా చేస్తున్నాను !

ఇటీవలే ‘మళ్ళీ రావా’ సినిమాతో మంచి హిట్ అందుకున్న హీరో సుమంత్ ప్రస్తుతం చేస్తున్న చిత్రంలో కూడా విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఆ సినిమా విశేషాల్ని, ఫ్యూచర్ ప్లాన్స్ ను మాతో జరిపిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆ విషయాలు మీకోసం..

ప్ర) ‘మళ్ళీ రావా’ కు వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత నా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం సంతోషంగా అనిపిస్తోంది. సినిమా మూడు వారాలు పూర్తిచేసుకుంది. ముఖ్యంగా ఏ సెంటర్స్ లో. నా సినిమాలన్నిటిలోకి ఇదే బెస్ట్ మూవీ అని అంటున్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్.

ప్ర) మీరు ఆ సినిమా చేయడానికి ముఖ్య కారణం ?
జ) ముందు అన్ని కథల్లాగే విన్నాను. కానీ సగం స్క్రిప్ట్ అయ్యాక డిఫరెంట్ గా ఉందని అనిపించింది. గౌతమ్ కథను నరేట్ చేసిన విధానం కూడా నాకు నచ్చింది. నా పాత్రలోని సింప్లిసిటీ వెంటనే సినిమాకు ఓకే చెప్పేలా చేసింది.

ప్ర) మీ పాత్ర కోసం ఎలాంటి ఎలాంటి హోమ్ వర్క్ చేశారు ?
జ) పాత్ర రియలిస్టిక్ గా ఉండేలా నటించాను. చాలా సాంన్నివేశాల్లో ఎమోషనల్ అయ్యాను. నా పాత్రను రాసిన విధానం, సన్నివేశాలను వివరించిన తీరు నన్ను బెటర్ గా పెర్ఫార్మ్ చేసేలా చేశాయి.

ప్ర) సినిమాలో ఏది బాగా వర్కవుట్ అయిందని అనుకుంటున్నారు ?
జ) ప్రేక్షకులు జీరో అంచనాలతో థియేటర్లోకి వెళ్లి మంచి కంటెంట్ చూసి సప్రైజ్ అయ్యారు. పైగా సంగీతం కూడా బాగుండటం ఇంకో ప్లస్. అలాగే చిన్నప్పటి ఎపిసోడ్స్, స్క్రీన్ ప్లే అన్నీ బాగుండటంతో అంతా కనెక్టయ్యారు.

ప్ర) ఎలాంటి సినిమాలంటే మీరు ఇష్టపడుతారు ?
జ) నాకు డ్రామాలంటే చాలా ఇష్టం. ముఖ్యంగా లవ్, యాక్షన్ డ్రామాల్ని ఎక్కువగా ఇష్టపడతాను. వాటిలో చాలా ఎమోషన్ ఉంటుంది. అలాంటి సినిమాలంటే ఎక్కువ ఇష్టపడతాను.

ప్ర) ఈ మధ్య తక్కువ సినిమాలు ఎందుకు చేస్తున్నారు ?
జ) నాకెప్పుడూ నాలుగైదు సినిమాలు చేతిలో ఉంటాయి. కానీ వాటిలో 90 శాతం ఉపయోగం లేనివి. పైగా నాకు డబ్బు కోసం సినిమాలు చేయడం ఇష్టం ఉండదు.

ప్ర) ఇప్పుడు మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ మీ కెరీర్ ప్లాన్ ఏంటి ?
జ) తెలుగు సినిమా పరిస్థితి మారింది. అర్జున్ రెడ్డ్ లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాలు వస్తున్నాయి. నేను కూడా నా స్కిల్స్ ను పెంచుకోవాలని అనుకుంటున్నాను. అందుకే నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేస్తున్నాను.

ప్ర) 2017 లో మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన డైరెక్టర్ ఎవరు ?
జ) సందేహం లేకుండా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి. చాలా బాగా సినిమా తీశాడు.

ప్ర) మీ తర్వాతి సినిమాల గురించి చెప్పండి ?
జ) ప్రస్తుతం కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠంతో ఒక సినిమా చేస్తున్నాను. ‘మళ్ళీ రావా’ కు ఈ సినిమాలో పాత్రకి చాలా తేడా ఉంటుంది. నెగెటివ్ షేడ్స్ ఉండే మీడియా ఫోటోగ్రఫర్ పాత్ర.