సుమంత్ ‘ఇదం జగత్’ లేటెస్ట్ అప్ డేట్ !

సీనియర్ హీరో సుమంత్ నటించిన తాజా చిత్రం ‘ఇదం జగత్’ విడుదలకు సిద్దమవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వం వహిస్తున్నారు.

అంజు కురియన్ కథానాయికగా నటించిన ఈచిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. జొన్నలగడ్డ పద్మావతీ, గంగపట్నం శ్రీధర్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక సుమంత్ నటిస్తున్న 25వ చిత్రం ‘సుబ్రహ్మణ్యపురం’ కూడా నవంబర్ నెలలోనే ప్రేక్షకులముందుకు రానుంది.

Exit mobile version