సుమంత్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఖరారు !
Published on Nov 22, 2017 6:37 pm IST


శ్రీ నక్క యాదగిరి స్వామి యాదవ్ ఆశీస్సులతో స్వధర్మ్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై సుమంత్ హీరోగా ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా మళ్ళి రావా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. రాహుల్ యాదవ్ నక్క ఈ మూవీ ని నిర్మించడం జరిగింది. తాజాగా విడుదల చేసిన ఈ సినిమా టిజర్ కు మంచి స్పందన లభించింది.

ఫీల్ గుడ్ లవ్ స్టోరితో తెరకెక్కుతున్న ఈ సినిమా తో సుమంత్ కమ్ బ్యాక్ అవుతాడని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ మద్య సుమంత్ నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు మళ్ళిరావా సినిమాతో సుమంత్ హిట్ అందుకుంటాడని ఆశిద్దాం.

 
Like us on Facebook