సుమంత్ హీరోగా “అహం రీబూట్” చిత్రం ప్రారంభం

Published on Nov 15, 2021 9:54 pm IST


సుమంత్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా అహం రీబూట్. వాయుపుత్ర ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఎస్ ఒరిజినల్స్ ల పై రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. అహం రీబూట్ సినిమా షూటింగ్ నేడు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా హాజరైన దర్శకులు చందూ మొండేటి కెమెరా స్విచ్ఛాన్ చేయగా, శరణ్ కొప్పిశెట్టి క్లాప్ కొట్టారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు ప్రశాంత్ సాగర్ మాట్లాడుతూ, “సుమంత్ ఆర్జే క్యారెక్టర్ లో కనిపించనున్న అహం రీబూట్ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది. అహం అంటే నేను. అహం రీబూట్ అంటే సెల్ఫ్ రీబూట్, ఈగో, పొగరు, ద్వేషం లాంటి అర్థాలు కాకుండా అహం అంటే నేను అనే విషయాన్ని చెబుతున్నాం” అని అన్నారు. సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.

ఈ చిత్రానికి సంగీతం శ్రీరామ్ మద్దూరి, సినిమాటోగ్రఫీ వరుణ్ అంకర్ల, స్క్రిప్ట్ సూపర్ విజన్ సుమ కార్తికేయ, ప్రొడక్షన్ డిజైన్ ఏఆర్ వంశీ, సౌండ్ నాగార్జున తాళ్లపల్లి, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాతలు రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు, రచన, దర్శకత్వం ప్రశాంత్ సాగర్ అట్లూరి లుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More