సూపర్ స్టార్ మహేష్ ట్వీట్ కి సుమంత్ ప్రభాస్ స్వీట్ రిప్లై

Published on May 25, 2023 7:48 pm IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో SSMB 28 మూవీ చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. ఇక తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి మాదిరిగా తరచు న్యూ టాలెంట్ ని అలానే మంచి సినిమాలని తనవంతుగా సపోర్ట్ చేస్తూ వారికి ప్రోత్సాహం అందిస్తుంటారు మహేష్ బాబు. లేటెస్ట్ గా సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన మూవీ మేమ్ ఫేమస్. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కెట్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై నిర్మితం అయిన ఈ మూవీని అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ సంయుక్తంగా నిర్మించారు. రేపు విడుదల కానున్న ఈ మూవీని విడుదలకి ముందే వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు, సినిమా అద్భుతుకంగా ఉందని, సుమంత్ ప్రభాస్ తో పాటు యూనిట్ మొత్తానికి తన తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తూ కొద్దిసేపటి క్రితం ఒక ట్వీట్ చేసారు. కాగా సూపర్ స్టార్ ట్వీట్ కి ఎంతో సంతోషం వ్యక్తం చేసిన నటుడు, దర్శకుడు సుమంత్ ప్రభాస్ తాజాగా ఆయనకు స్వీట్ రిప్లై ని అందించారు.

అన్నా మీరు సినిమా చూడడానికి టైమ్ ఇవ్వడం, అలానే సినిమా చూసి ట్వీట్ చేయడం నిజంగా నమ్మలేక పోతున్నా. ఇప్పుడు నిజంగా ఫేమస్ అయినట్టు అనిపిస్తోంది అన్న. ఇంట్లో మహేష్ బాబు అన్న సినిమా వస్తే మిస్ అవ్వకుండా చూసే మా అమ్మ ఇవ్వాళ మా కొడుకు ఫస్ట్ సినిమా చూసి సపోర్ట్ చేయడమే కాదు రెండో సినిమాని ప్రొడ్యూస్ చేస్తా అంటుంటే మనస్పూర్తిగా మటన్ వండి పంపించాలి అని ఫోన్ చేస్తుంది. అసలు ఈ వయసులో నాకొచ్చిన సంతోషం వ్యక్తం చేయనికి వ్యాసం రాసినా తక్కువే అనిపిస్తోంది. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అన్నా. మాలాంటి యువతని ఇంత ప్రోత్సహిస్తున్నందుకు త్వరలో శరత్ అన్న, అనురాగ్ అన్నలతో కలిసి వచ్చి మీకు మజా అనిపించే స్క్రిప్ట్ నారేషన్ ఇస్తాం. అలానే మా మీద మీరు ఉంచిన నమ్మకాన్ని ఏమాత్రం పోగొట్టం అంటూ సుమంత్ ప్రభాస్ పెట్టిన స్వీట్ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రేపు అనగా మే 26న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ ఎంత మేర సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :