‘ఎన్టీఆర్ సినిమా’ నుంచి ‘ఏఎన్నార్’ పోస్టర్ వచ్చింది !

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ నుండి చిత్రబృందం ఇప్పటికే ప్రధానపాత్రల గెటప్స్ ని రివీల్ చేస్తూ వస్తోంది. తాజాగా నట సామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. సుమంత్ ఏఎన్నార్ గెటప్ లో, అచ్చం ఏఎన్నార్ లానే ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతుండటం విశేషం.

కాగా ఇటీవలే జరిగిన షూట్ లో సుమంత్, ఏఎన్నార్ చనిపోయే ముందు ఆయన చివరిగా ఉపయోగించిన కారులోనే సుమంత్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారట. అక్కినేని మరియు నందమూరి అభిమానులు కూడా సుమంత్ ‘ఏఎన్నార్’లా ఎలా నటిస్తారో అని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Exit mobile version