విక్కీ డోనార్ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ చేయమని తాతగారు చెప్పేవారు – సుమంత్
Published on Oct 31, 2016 4:54 pm IST

sumanth
అక్కినేని హీరోల్లో గత కొన్నాళ్లుగా సరియన్ హిట్ లేక కెరీర్లో ఇబ్బంది పడుతున్న హీరో సుమంత్ తాజాగా చేసిన చిత్రం ‘నరుడా డోనారుడా’. బాలీవుడు సూపర్ హిట్ మూవీ ‘విక్కీ డోనార్’ కు తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 4న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్లు జనాల్లో సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గరపడటంతో చిత్ర టీమ్ కూడా ప్రమోషన్ల పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో హీరో సుమంత్ తో పాటు దర్శకుడు మల్లిక్ రామ్, నిర్మాత జాన్‌ సుధీర్‌ పూదోట పాల్గొన్నారు.

ఈ సందర్బంగా సుమంత్ మాట్లాడుతూ ‘ ఇది ఓ సెన్సివిటీ ఉన్న సబ్జెక్ట్. తాతగారు చివరి రోజుల్లో ఉన్నప్పుడు ‘విక్కీ డోనార్’ చిత్రం చూసి తెలుగులో కూడా ఇలాంటి డిఫరెంట్ సినిమాలు రావాలి అన్నారు. అప్పుడే ఈ సినిమాని రీమేక్ చెయ్యాలని అనుకున్నా. తరువాత నా దగ్గరకి వచ్చిన దర్శకులందరినీ విక్కీ డోనార్ రీమేక్ చేయమని అడిగా. చివరికి ‘గోల్కొండ హై స్కూల్’ నిర్మాత రామ్మోహన్ రావు గారే స్వయంగా ఈ సినిమా చేయమని నన్ను అడగడంతో వెంటనే సినిమా స్టార్ట్ చేశాం. మొత్తం 60 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.

 
Like us on Facebook