“సీతా రామం” నుంచి ఆసక్తికరంగా సుమంత్ ఇంటెన్స్ లుక్.!

Published on Jul 9, 2022 1:01 pm IST

ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర నుంచి వస్తున్న కొన్ని మల్టీ లాంగువల్ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవపూడి టాలెంటెడ్ నటీ నటులు దుల్కర్ సల్మాన్ మరియు మృణాల్ ఠాకూర్ తదితర నటీనటులు నటిస్తున్న చిత్రం “సీతా రామం”. ఒక క్లాసిక్ సినిమాగా బ్యూటిఫుల్ మూమెంట్స్ తో తెరకెక్కుతూ క్లీన్ అప్డేట్స్ తో వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ నటుడు సుమంత్ పై ఒక ఆసక్తికర అప్డేట్ టీజర్ ని రిలీజ్ చేశారు.

తనని బ్రిగాడైర్ విష్ణు శర్మ గా పరిచయం చేస్తూ తనది ఒక సీరియస్ లుక్ ని రిలీజ్ చేశారు. అంతే కాకుండా ఈ వీడియోలో విజువల్స్, డైలాగ్స్ కూడా మరింత ఆసక్తిగా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే సీతా రామం నుంచి సుమంత్ లుక్ చాలా ఇంటెన్స్ గా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా స్వప్న సినిమాస్ వారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే భారీ బ్యానర్ వైజయంతి మూవీస్ వారు ప్రెజెంట్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :