సుమంత్ “మళ్ళీ మొదలైంది” ఓటిటి రిలీజ్ కి డేట్ ఫిక్స్.!

Published on Jan 23, 2022 11:00 am IST


తన కెరీర్ ని “మళ్ళీ రావా” తో మళ్ళీ రీస్టార్ట్ చేసి ట్రాక్ లో పడ్డ మరో సీనియర్ హీరో సుమంత్ ఇప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్నాడు. మరి ఈ లైనప్ లో తన హిట్ టైటిల్ తరహాలోనే స్టార్ట్ చేసిన మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “మళ్ళీ మొదలైంది”. యంగ్ హీరోయిన్ నైనా గంగూలీ హీరోయిన్ గా నటించగా టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

మరి ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా ని నేరుగా ఓటిటి లో రిలీజ్ చెయ్యడానికి ఫిక్స్ చేశారు. ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ ‘జీ 5’ వారు ఈ సినిమా హక్కులు కొనుగోలు చెయ్యగా ఇప్పుడు దీనిని స్ట్రీమింగ్ డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 11న డైరెక్ట్ డిజిటల్ ప్రీమియర్ గా రిలీజ్ చేయనున్నట్టు ఇప్పుడు డేట్ అనౌన్స్ చేసారు. మరి ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :