నూతన దర్శకుడితో కొత్త ప్రయోగానికి సిద్దమైన సుమంత్ !

13th, September 2017 - 10:25:52 AM


‘నరుడా డోనరుడా’ చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న హీరో సుమంత్ ఈసారి రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్ని కాకుండా కథ, పాత్ర పరంగా కొత్తదనమున్న సినిమాను చేయాలనే ఉద్దేశ్యంతో పలు కథల్ని విని ఒక థ్రిల్లర్ కథను ఎంచుకున్నారు. ఈ కథలో సుమంత్ పాత్రకు కొంత నెగెటివ్ షేడ్స్ ఉండనున్నాయి. రియాలిటీకి దగ్గరగా ఉంటూ, సరికొత్త బ్యాక్ డ్రాప్లో నడవనున్న ఈ సినిమాను అనిల్ శ్రీకంఠం అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేయనున్నాడు.

ఈయన గతంలో ‘పిల్ల జమిందార్, సుకుమారుడు, ఊహలు గుస గుసలాడే’ సావిత్రి, చిత్రాంగధ’ వంటి సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేశాడు. ఇప్పటికే పలుసార్లు ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరిపిన సుమంత్ స్క్రిప్ట్ పట్ల చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ నెల నుండి మొదలుకానున్న ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనే వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఇకపోతే సుమంత్ నటించిన రొమాంటిక్ డ్రామా ‘మళ్ళీ రావా’ త్వరలోనే విడుదలకానుంది.