ఏప్రిల్ మొదటి వారంలో సుమంత్ సినిమా టీజర్ ?

హీరో సుమంత్ ప్రస్తుతం తన 24వ సినిమా చిత్రీకరణ ముగింపు పనుల్లో ఉన్నారు. నూతన దర్శకుడు అనిల్ శ్రీకంఠం డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి ‘ఇదమ్ జగత్’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా చిత్ర టీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇంకొద్ది రోజుల్లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఏప్రిల్ మొదట్లో టీజర్ ను విడుదల చేయాలని భావిస్తున్నారట. అంజు కురియన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సుమంత్ కొంత నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించనున్నారట.

ఇకపోతే సుమంత్ తమ 25వ చిత్రాన్ని నిన్న ఉగాది సందర్బంగా అనౌన్స్ చేశారు. నూతన దర్శకుడు సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి ‘సుబ్రమణ్యపురం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version