వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్దమైన సుమంత్ ప్లాప్ మూవీ

Published on May 16, 2023 5:14 pm IST


తెలుగు యాక్టర్ సుమంత్ హీరోగా యువ దర్శకుడు టిజి కీర్తి కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతూ రూపొందిన మూవీ మళ్ళీ మొదలైంది. నైనా గంగూలీ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు. దాదాపుగా ఏడాదిన్నర క్రితం ప్రముఖ ఓటిటి మాధ్యమం జీ 5 లో డైరెక్ట్ గా రిలీజ్ అయిన ఈమూవీ ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేదు. కాగా విషయం ఏమిటంటే, 2023 మే 18న ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ జీ తెలుగులో ఈ మూవీని తొలిసారిగా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయనున్నారు.

మరి ఓటిటి లో పెద్దగా అలరించని ఈ మూవీ టెలివిజన్ వ్యూవర్స్ ని ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి. వర్షిణి సౌందరరాజన్, పోసాని కృష్ణ మురళి, సుహాసిని, అన్నపూర్ణ, మంజుల ఘట్టమనేని, వెన్నెల కిషోర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కె రాజశేఖర్ రెడ్డి నిర్మించగా అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :