రాజమౌళి చిత్రం సరిగ్గా సంవత్సరంలో పూర్తవుతుందట !
Published on Nov 22, 2017 1:03 pm IST

రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా చరణ్, ఎన్టీఆర్ లతో కలిసి ఉన్న ఫోటోను పెట్టి పరోక్షంగానే వారిద్దరితో సినిమా చేయనున్నట్లు చెప్పేశారు. ఈ విషయంపై ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవికి మొదలుకానుందట. ఎందుకంటే ప్రస్తుతం ‘రంగస్థలం 1985’ చేస్తున్న చరణ్ ఆ తర్వాత బోయపాటి సినిమను మొదలుపెట్టి వేసవి ఆరంభంలో ముగించేస్తారు.

అలాగే తారక్, త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా కూడా దాదాపు వేసవి వచ్చే నాటికి ముగియనుంది. దీంతో జక్కన్న సమ్మర్ నాటికి స్క్రిప్ట్ వర్క్ ముంగించి సినిమాను మొదలుపెడతారని సమాచారం. అంతేగాక సరిగ్గా సంవత్సరం పాటు షూటింగ్ జరిపి 2019 వేసవికి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు రాజమౌళి.

సుమారు రూ. 150 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి మార్కెట్ దేశవ్యాప్తమవడంతో ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, హిందీల్లో కూడా రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

 
Like us on Facebook