ఇప్పుడు తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అవైటెడ్ సీక్వెల్ సినిమానే ‘జైలర్ 2’. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా చాలా కాలం తర్వాత నటించిన సీక్వెల్ సినిమా ఇదే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ సినిమా గ్రాండ్ గా విడుదలకి రాబోతుంది. అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అంటే కొన్ని విషయాల్లో మంచి స్టాండర్డ్స్ ఉన్నాయి.
ఎన్నో సూపర్ క్వాలిటీ ప్రోడక్ట్ లు వీరి నుంచి వచ్చాయి. అలాగే ప్రమోషనల్ కంటెంట్ ని కూడా వీరు అంతే రీతిలో సిద్ధం చేస్తారు. సోషల్ మీడియాలో అయితే వీరి ప్రమోషనల్ కంటెంట్, ఎడిట్స్ కి నెటిజన్స్ నుంచి మంచి మార్కులు కూడా పడతాయి. కానీ జైలర్ 2 విషయంలో ఈ మధ్య మాత్రం వీరి నుంచి ఈ క్వాలిటీ బాగా మిస్ అవుతుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఊహించని విధంగా వీరు ఏఐ విజువల్స్ వదులుతున్నారు. దీనితో నెటిజన్స్ కూడా సన్ పిక్చర్స్ వాళ్ళు ఇంతలా డీగ్రేడ్ అయిపోయారా అనే కామెంట్స్ చేశారు. అంతెందుకు మొన్న ట్రైలర్ లోనే ఓ బ్లాస్ట్ షాట్ పై కూడా అనేక కామెంట్స్ వచ్చాయి. ఇక లేటెస్ట్ గా వచ్చిన పోస్టర్స్ కూడా అవెంజర్స్ సినిమా స్టైల్ లో కాపీ కొట్టినట్టే ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ప్రమోషనల్ కంటెంట్ లో తమదైన వైవిధ్యతను, క్రియేటివిటీ చూపించే వీరు ఇలా చేస్తుండడంతో ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు.
