‘ఇంద్రసేన’ శాటిలైట్ హక్కుల్ని సొంతం చేసుకున్న సన్ టీవీ !
Published on Nov 21, 2017 3:21 pm IST

‘డా.సలీం, బిచ్చగాడు,నకిలీ, భేతాళుడు’ వంటి సినిమాలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు విజయ్ ఆంటోనీ త్వరలో ‘ఇంద్రసేన’ సినిమాతో ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఎప్పటికప్పుడు వినూత్న ఆలోచనలతో సినిమాలు చేసే విజయ్ ఈసారి ఈ చిత్రంలో బ్రదర్ సెంటిమెంట్ ను ఎలివేట్ చేయనున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా యొక్క తమిళ, తెలుగు శాటిలైట్ హక్కుల్ని ప్రముఖ టీవీ ఛానెల్ సన్ టీవీ మంచి ధరకు కొనుగోలుచేసింది. అలాగే థియేట్రికల్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడవడంతో నిర్మాతలు ముందుగానే డబుల్ ప్రాఫిట్స్ కళ్లజూశారు. ఈ నెల 30న విడుదలకానున్న ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత కృష్ణారెడ్డి సమర్పించనున్నారు.

 
Like us on Facebook