సందీప్ కిషన్, వి ఐ ఆనంద్ ల ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్!

Published on Sep 19, 2021 1:00 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ చిత్రం “గల్లీ రౌడీ” నిన్ననే రిలీజ్ అయ్యి మంచి టాక్ సంతరించుకున్న సంగతి తెలిసిందే. మరి దీని తర్వాత మరిన్ని చిత్రాలు టేకప్ చేసిన సందీప్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు వి ఐ ఆనంద్ కాంబోలో ప్లాన్ చేసిన చిత్రం కూడా ఒకటి. సందీప్ 28వ సినిమాగా గత కొన్నాళ్లు కితం అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ ని ఈరోజు హైదరాబాద్ లో మేకర్స్ పూజా కార్యక్రమంతో లాంచ్ చేశారు.

వీరి కాంబోలో వస్తున్న ఇది రెండో చిత్రం కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో నిర్మాతలు జెమినీ కిరణ్ మరియు సుధీర్ లు స్క్రిప్ట్స్ ని మేకర్స్ కి అందించగా అల్లరి నరేష్ క్లాప్ కొట్టారు అలాగే విజయ్ కనక మేడల ఫస్ట్ షాట్ ని డైరెక్ట్ చేశారు. మరి ఈ చిత్రానికి కావ్య థపర్ హీరోయిన్ గా ఫిక్స్ అవ్వగా శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. అలాగే హాస్య మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం నిర్మించబడుతుంది.

సంబంధిత సమాచారం :