యంగ్ హీరోతో రెండవ సినిమా చేయాలనుకుంటున్న గౌతమ్ మీనన్ !


దర్శకుడు గౌతమ్ మీనన్ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈయన తమిళ యువ దర్శకుడు ‘డి-16’ ఫేమ్ కార్తీక్ నరేన్ దర్శకుడిగా ‘నరగసూరన్’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇటీవలే తమిళంలో ‘మానగరం’ తెలుగులో ‘శమంతకమణి’ వంటి చిత్రాల్లో సందీప్ కిషన్ చేసిన భిన్నమైన రోల్స్ పట్ల ఇంప్రెస్ అయిన గౌతమ్ మీనన్ అతనితో ఒక ప్రాజెక్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమా ఖచ్చితంగా తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా ఉంటుందని తెలుస్తోంది. భిన్నమైన రోల్స్ ఎంచుకుంటూ తెలుగు, తమిళ పరిశ్రమల్లో తనకంటూ ఒక ప్రత్యేకతను సొంతం చేసుకున్న సందీప్ కిషన్ కు గౌతమ్ మీనన్ తో చేయబోయే ఈ సినిమా కెరీర్ పరంగా బాగా ఉపయోగపడే అవకాశముంది. ఇకపోతే ఈ యువ హీరో తమిళ దర్శకుడు తిరు డైరెక్షన్లో కూడా ఒక ద్విభాషా చిత్రానికి సైన్ చేశారు.