సందీప్ కిషన్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది !
Published on Nov 7, 2016 1:53 pm IST

sundeep
ఈ మధ్య కాలంలో పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయిన యంగ్ హీరోల్లో ‘సందీప్ కిషన్’ కూడా ఒకరు. ఈసారి ఎలాగైనా సక్సెస్ సాధించాలన్న ఉద్దేశ్యంతో సందీప్ కిషన్ కాస్త డిఫరెంట్ గా ఆలోచిస్తూ భిన్నమైన ప్రాజెక్టులను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన దర్శకుడు కృష్ణ వంశీ డైరెక్షన్లో ‘నక్షత్రం’ పేరుతో యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. అలాగే తాజాగా తమిళ దర్శకుడు సుశీంద్రన్ డైరెక్షన్లో ఓ కొత్త సినిమాకి సైన్ చేశాడు.

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన మెహ్రీన్ కౌర్ ప్రిజాదా హీరోయిన్ గా నటిస్తోంది. సుశీంద్రన్ గతంలో కార్తీ చేసిన ‘నా పేరు శివ’తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు. ఇకపోతే ఈ సినిమాను నవంబర్ 9న ఫిల్మ్ నగర్ లోని దైవ సన్నిధానంలో లాంచ్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందనుంది.

 
Like us on Facebook