సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రారా కృష్ణయ్య’

Ra Ra Krishnayya
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సూపర్ హిట్ అందుకొని అదే జోరు మీద వరుసగా సినిమాలు చేస్తున్న యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమా ‘రారా కృష్ణయ్య’. ఈ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూలై 4న ఈ సినిమా రిలీజ్ కావడానికి సిద్దమవుతోంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

సందీప్ కిషన్ సరసన రెండవసారి రెజీన కసాండ్ర హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ కి అన్నగా పూర్తి మాస్ లుక్ లో జగపతి బాబు కనిపించనున్నాడు. జగపతి బాబుకి జోడీగా కళ్యాణి కనిపించనుంది. కామెడీ-లవ్ సమానంగా ఉంటుందని చెప్తున్న ‘రారా కృష్ణయ్య’ ద్వారా మహేష్ బాబు డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమాని కృష్ణ శ్రీనివాస్ నిర్మించారు.

Exit mobile version