ఊహించని లుక్ లో సందీప్ కిషన్ “మైఖేల్” ఫస్ట్ లుక్ పోస్టర్.!

Published on May 7, 2022 11:00 am IST

మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సందీప్ కిషన్ కూడా ఒకడు. రీసెంట్ గా మంచి బ్యాక్ డ్రాప్ సినిమాలను తాను ఎంచుకుంటూ వస్తున్నాడు. అలా తాను తాజాగా టేకప్ చేసిన ఒక సాలిడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ “మైఖేల్”. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.

అయితే ఇది మాత్రం ఇది వరకు రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ పూర్తి డిఫరెంట్ గా ఊహించని రీతిలో ఉందని చెప్పాలి. మరోసారి సందీప్ తన స్టన్నింగ్ సిక్స్ ప్యాక్ ని చూపిస్తూ ఒక ఇంటెన్స్ యాక్షన్ సీవేన్స్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కొందరు తన చుట్టూ తుపాకులు కత్తులు పట్టుకొని దాడి చెయ్యడానికి వస్తుండగా వారి మధ్యలో నిలబడి వారిని షూట్ చేస్తున్నట్టుగా తాను కనిపిస్తున్నాడు.

దీనితో ఈ సినిమాలో మంచి యాక్షన్ తో పాటు ఏదన్నా రివెంజ్ కూడా ఉండేలా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాకి రంజిత్ జైకోడి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రానికి శ్రీనివాస సినిమాస్ ఎల్ ఎల్ పి వారు మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :