ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సందీప్ కిషన్ ‘సూపర్ సుబ్బు’

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా ఇప్పుడు పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్ స్క్రీన్ పై ఈ సినిమాలు మాత్రమే కాకుండా ఓటిటిలో కూడా తాను చేసాడు. అలా తాను రీసెంట్ గా చేసిన ఓ ఫన్ వెబ్ సిరీస్ నే ‘సూపర్ సుబ్బు’. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో కోలాబ్ అయ్యి సందీప్ కిషన్ చేసిన ఈ సిరీస్ కి డీజే టిల్లు దర్శకుడు మల్లిక్ రామ్ దర్శకత్వం వహించగా ఈ సిరీస్ ఫైనల్ గా ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ జూలై 2 మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల నుంచి నెట్ ఫ్లిక్స్ వారు ఒరిజినల్ తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలు కలిపి మొత్తం 8 భాషల్లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఈ సిరీస్ ని చూడాలి అనుకునేవారు నెట్ ఫ్లిక్స్ లో ట్రై చేయొచ్చు. ఇక సిరీస్ లో మానస చౌదరి, బ్రహ్మానందం అలాగే మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ రివ్యూ (సమీక్ష) కోసం 123తెలుగు.కామ్ ను చూస్తూ ఉండండి.

Exit mobile version