రాజ్ తరుణ్ దర్శకుడితో సందీప్ కిషన్ సినిమా !


ఇటు తెలుగు అటు తమిళంలలో వరుస సినిమాలు చేస్తున్న సందీప్ కిషన్ మరొక కొత్త సినిమాకు సైన్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. ఇటీవలే రాజ్ తరుణ్ తో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ సినిమా చేసి విజయానందుకున్న దర్శకుడు వంశీ కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్రానికి ‘సినిమా చూపిస్తా మావ, నేను లోకల్’ కు రచయితగా పని చేసిన ప్రసన్న కుమార్ కథను అందిస్తున్నారట. అంతేగాక ఈ చిత్రం పూర్తి స్థాయి రొమాంటిక్, కామెడీ ఎంటెర్టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇకపోతే సందీప్ కిషన్ ప్రస్తుతం ‘నక్షత్రం’, ‘ప్రాజెక్ట్ జెడ్’ వంటి సినిమాల విడుదల కోసం చూస్తూనే మహేష్ బాబు సోదరి మంజుల దర్శకత్వంలో ఒక కొత్త సినిమాను ఇటీవలే ఆరంభించారు.