వైరల్: కోలీవుడ్ స్టార్ హీరోతో మైఖేల్!

Published on Feb 2, 2023 12:57 pm IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ మొదటి పాన్ ఇండియన్ మూవీ మైఖేల్ రేపు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ చిత్రం పై సందీప్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో డివ్యాన్ష కౌశిక్ కథానాయికగా నటించింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ని సందీప్ కిషన్ కలిశారు. అదే విషయాన్ని తన సోషల్ ప్రొఫైల్స్ ద్వారా పంచుకున్నాడు సందీప్.

మైఖేల్‌పై స్టార్ హీరో చేసిన మంచి వ్యాఖ్యలకు, ప్రేమకు, చిత్రానికి మద్దతు తెలిపినందుకు యంగ్ హీరో సంతోషం వ్యక్తం చేశాడు. సందీప్ విజయ్‌తో కలిసి ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. షేర్ చేసిన ఆ పిక్ కొద్దిసేపటికే వైరల్‌గా మారింది. మైఖేల్ చిత్రంలో విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్‌కుమార్, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ మరియు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి సహకారంతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :