సందీప్ కిషన్ తదుపరి చిత్రంలో కనిపించనున్న సురభి అనే హీరోయిన్ చిరకాల కోరిక నెరవేరింది. ఒక ప్రముఖ జ్యువలరీ షాప్ యాడ్ లో హృతిక్ రోషన్ సరసన నటించింది. ఆ యాడ్ ఈ భామ చాలా అందంగా వుందని, ఈ యాడ్ ద్వారా నేషనల్ స్టేటస్ వచ్చే అవకాశాలు వున్నాయని పలువురు ప్రశంసలను అందుకుంది
సందీప్ కిషన్ తదుపరి చిత్రంను ఉషా కిరణ్ మూవీస్ మరియు ఆనంది ఆర్ట్స్ బ్యానర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమిళ దర్శకుడు కన్మణి దర్శకత్వం వహించనున్నారు. సురభి గతంలో తమిళం నుండి తెలుగుకి రిమేక్ అయిన ‘సిటిజెన్’ సినిమాలో నటించినా ఆ చిత్రం ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు గుర్తింపు రాలేదు. మరి ఈ సందీప్ కిషన్ సినిమాపైనే ఈ భామ ఆశలన్నీ…
