సందీప్ కిషన్ “మైఖేల్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సర్వం సిద్ధం!

Published on Jan 29, 2023 3:26 pm IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా మైఖేల్ ఫిబ్రవరి 3, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రంజిత్ జెయకోడి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రమోషన్‌లతో సంచలనం సృష్టించింది. తాజా వార్త ఏమిటంటే, జనవరి 31, 2023న హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్ సెంటర్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేసారు.

సాయంత్రం 6 గంటల నుంచి ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతానికి, ఈవెంట్‌కి ముఖ్య అతిథి గురించి ఎటువంటి సమాచారం లేదు. విజయ్ సేతుపతి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, అనసూయ భరద్వాజ్, వరుణ్ సందేశ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP మరియు కరణ్ సి ప్రొడక్షన్స్ LLP సంయుక్తం గా నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీత దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :