త్వరలో విడుదలకానున్న సందీప్ కిషన్ కొత్త సినిమా టీజర్ !
Published on Nov 21, 2017 5:59 pm IST

తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ రెండు పరిశ్రమలకు దగ్గరవుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం ‘నరగసూరన్’ అనే సినిమా చేస్తున్నారు. ఊటీలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నరకాసురుడు’ పేరుతో రిలీజ్ చేయనున్నారు.

ఇకపోతే ఈ చిత్రం యొక్క టీజర్ ను ఈ నెల 25న రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ స్వయంగా సినిమను నిర్మిస్తుండటం, ”దురువంగల్ పతిన్నారు’ తో సంచలనం సృష్టించిన యువ దర్శకుడు కార్తీక్ నరేన్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ స్థాయి క్రేజ్ నెలకొంది. అరవింద స్వామి, శ్రియ శరన్ లాంటి స్టార్ నటులు నటిస్తున్న ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలనే యోచనలో ఉన్నారు హీరో సందీప్ కిషన్.

 
Like us on Facebook