“శంకర్ – చరణ్ 15” లో సునీల్ రోల్ మామూలుగా ఉండదట..!

Published on May 27, 2022 10:00 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రస్తుతం మన ఇండియన్ జేమ్స్ క్యామెరున్ తో ఇక భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా శంకర్ మార్క్ లోనే ఒక సాలిడ్ యాక్షన్ సోషల్ డ్రామా గా తెరకెక్కనుండగా ఈ సినిమాపై లేటెస్ట్ గా నటుడు సునీల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చెయ్యడం మరింత ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో తన రోల్ చరణ్ తో పక్కనే ట్రావెల్ అవుతుంది అని, తాను ఇప్పటి వరకు సినిమా కెరీర్ లో ఎప్పుడూ చెయ్యని ఒక హిలేరియోస్ రోల్ గా ఉంటుంది అని శంకర్ తనకి చాలా మంచి పాత్రని డిజైన్ చేసారని తెలిపాడు. అయితే శంకర్ సినిమాల్లో అన్ని ఎలిమెంట్స్ తో పాటుగా కామెడీ కూడా ఈ రేంజ్ లోనే ఉంటుంది. అలాగే హీరో పక్కన ఒక కమెడియన్ కి చాలా కీలక పాత్ర కూడా ఇస్తారు. మరి అలా ఈ సినిమాలో సునీల్ రోల్ ఎలా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :