“పుష్ప”లో సునీల్ రోల్ ఏంటి? సినిమా ఎంత బాలన్స్ ఉందంటే..!

Published on Oct 10, 2021 9:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా నిన్న ఇన్స్టాగ్రామ్ లైవ్ లోకి వచ్చిన సుకుమార్ మరిన్ని ఆసక్తికర అంశాలు ఈ సినిమాపై తెలపడం కూడా జరిగింది. అయితే వాటిలో నటుడు సునీల్ పాత్ర ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది? ఎంత ఉండబోతుంది అన్నవాటిపై కూడా సుకుమార్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ఇచ్చారు.

ఈ చిత్రంలో సునీల్ పాత్ర ఫస్ట్ పార్ట్ వరకు మెయిన్ విలన్ గా కనిపిస్తాడని తెలిపారు. అంతే కాకుండా తన రోల్ చాలా సాలిడ్ గా ఉంటుందని ఆ పాత్ర ముగిశాకే నటుడు మరో విలన్ ఫహద్ ఫాజిల్ రోల్ సినిమాలో ఎంట్రీ ఇస్తుంది అని కన్ఫర్మ్ చేశారు. అయితే ఈ భారీ సినిమా బ్యాలన్స్ షూట్ పై కూడా లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది.

ప్రస్తుతానికి అయితే టాకీ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యిపోయినట్టే అట అలాగే ఇంకో రెండు సాంగ్స్ బ్యాలన్స్ ఉన్నాయి అవి కూడా అయ్యిపోతే మొదటి భాగంగా అయ్యిపోయినట్టే అని తెలుస్తుంది. మొత్తానికి మాత్రం పుష్ప ని సుకుమార్ వేరే లెవెల్లో చెక్కుతున్నారని మాత్రం కన్ఫర్మ్ అయ్యింది.

సంబంధిత సమాచారం :