రామ్ సినిమాలో మరో బాలీవుడ్ హీరో ?

రామ్ సినిమాలో మరో బాలీవుడ్ హీరో ?

Published on Dec 19, 2022 7:01 AM IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – హీరో రామ్ కలయికలో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో మరో బాలీవుడ్ హీరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. సీనియర్ హీరో సునీల్ శెట్టి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ శెట్టి కారణంగా కచ్చితంగా రామ్ సినిమాకి బాలీవుడ్ లో ప్లస్ కానుంది. అన్నట్టు ఈ సినిమాలో బాలీవుడ్ భామ ఊర్వశి రౌటేలా అదిరిపోయే ఐటమ్ సాంగ్ చేస్తోంది.

ఇక ఈ సినిమాలో రామ్ డ్యుయెల్ రోల్ లో కనిపిస్తాడని ఇప్పటికే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమాని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో అదిరిపోయే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు బోయపాటి. కాబట్టి.. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే, రామ్ కూడా ఈ సినిమా పై భారీ హోప్స్ పెట్టుకున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు