విష్ణు మంచు “జిన్నా” నుండి సునీల్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్!

Published on Oct 7, 2022 11:33 am IST

విష్ణు మంచు హీరోగా సూర్య దర్శకత్వం లో తెరకెక్కుతున్న హారర్ కామెడీ ఎంటర్టైనర్ జిన్నా. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్ మరియు సన్నీ లియోన్ కథానాయికలుగా నటిస్తున్నారు. AVA ఎంటర్టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది.

తాజాగా చిత్ర యూనిట్ సునీల్ క్యారెక్టర్ పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో సునీల్ పెంచలయ్యగా కనిపించనున్నారు. ఈ పాత్రలో అందరినీ మెప్పించబోతున్నాడు. నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం తెలుగు భాషలో మాత్రమే కాకుండా హిందీ, మలయాళ భాషల్లో అక్టోబర్ 21, 2022 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :