సునీల్‌, ధ‌న‌రాజ్ ల “బుజ్జి ఇలా రా” టైటిల్ పోస్ట‌ర్ రిలీజ్.!

Published on Aug 1, 2021 10:30 am IST


అనేక చిత్రాల్లో క‌మెడియ‌న్స్‌గా క‌లిసి మెప్పించిన ఏస్ కమెడియన్స్ సునీల్‌ మరియు ధ‌న‌రాజ్ లు కలిసి ప్ర‌ధాన‌పాత్ర‌ల్లో న‌టిస్తున్న లేటెస్ట్ మూవీకి `బుజ్జి ఇలా రా` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. `ఇట్స్ ఎ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్` అనేది ట్యాగ్‌లైన్‌. అంద‌రిలో ఆస‌క్తిని క్రియేట్ చేస్తోన్న ఈ టైటిల్ పోస్ట‌ర్‌తోనే సినిమా సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ మూవీ అని అర్థ‌మ‌వుతుంది.

ఇక ఈ చిత్రానికి గ‌రుడ‌వేగ ఫేమ్ సినిమాటోగ్రాఫర్ అంజి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటం విశేషం. దర్శకత్వంతో పాటు సినిమాటోగ్రాఫ‌ర్‌గానూ వ్యవహరిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి క‌థ‌, స్క్రీన్‌ప్లేను అందిస్తున్నారు. రూపా జ‌గ‌దీశ్ స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, జీ నాగేశ్వ‌ర‌రెడ్డి టీమ్ వ‌ర్క్ ప‌తాకాల‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాను, నాయుడు మాట‌ల‌ను అందిస్తున్నారు.చాందిని త‌మిళ‌ర‌స‌న్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వ‌ర‌లోనే చేసుకోనుంది.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు: క‌థ‌, స్క్రీన్ ప్లే: జి.నాగేశ్వ‌ర రెడ్డి, సినిమాటోగ్ర‌పీ, ద‌ర్శ‌క‌త్వం: గ‌రుడ‌వేగ అంజి, నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ రెడ్డి, స‌మ‌ర్ప‌ణ‌: రూపా జ‌గ‌దీశ్‌, బ్యాన‌ర్స్‌: జి.నాగేశ్వ‌ర రెడ్డి టీమ్ వ‌ర్క్‌, ఎస్ఎన్ఎస్ క్రియేష‌న్స్ ఎల్ఎల్‌పి, మ్యూజిక్‌: సాయి కార్తీక్‌, డైలాగ్స్‌: భాను,నాయుడు, ఆర్ట్‌: చిన్నా, ఎడిట‌ర్‌: చోటా కె.ప్ర‌సాద్‌, ఫైట్స్: రియ‌ల్ స‌తీశ్‌, కాస్ట్యూమ్స్‌: మ‌నోజ్‌, మేక‌ప్‌: వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామరాజు, పి.ఆర్‌.ఓ: వంశీ శేఖ‌ర్‌ వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :