RC15: సునీల్ పాత్ర డిఫరెంట్ యాంగిల్‌లో ఉండబోతుందా?

RC15: సునీల్ పాత్ర డిఫరెంట్ యాంగిల్‌లో ఉండబోతుందా?

Published on Sep 11, 2021 2:49 AM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఈ మధ్యనే గ్రాండ్‌గా ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా ఓ కాన్సెప్ట్ పోస్టర్‌ని కూడా రిలీజ్ చేసింది చిత్ర బృందం. అందరూ షూటు ధరిచి చేతిలో ఫైల్స్ పట్టుకుని స్టైలిష్‌గా నడుస్తూ వస్తున్న ఈ పోస్టర్‌లో సునీల్ కూడా ఉన్నాడు.

అయితే ఈ సినిమాలో సునీల్ పాత్రపై తాజాగా ఓ రూమర్ గట్టిగా వినిపిస్తుంది. ఈ సినిమాలో సునీల్ నెగిటివ్ షేడ్స్‌లో నటిస్తున్నాడని, ఈ పాత్ర చాలా కీలకంగా ఉంటుందట. డిఫరెంట్ యాంగిల్‌లో సునీల్‌ని చూపించబోతున్నారని, సునీల్‌కి ఈ సినిమా మంచి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చర్చించుకుంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు