శ్రీనువైట్ల సినిమాలో నటించనున్న సునీల్ !

23rd, December 2017 - 03:53:23 PM

ఒకప్పుడు వరుసగా సక్సెస్ ఫుల్ సినిమాలకు దర్శకత్వం వహించిన శ్రీనువైట్ల ఈ మద్య తను తీసిన ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ వంటి సినిమాలు పెద్దగా విజయం సాదించలేదు. తాజాగా ఈ డైరెక్టర్ రవితేజ తో సినిమా చెయ్యబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోయే ఈ సినిమా త్వరలో ప్రారంభం కానుంది.

శ్రీనువైట్ల ఈ సినిమాలో సునీల్ కు మంచి పాత్ర ఇచ్చినట్లు సమాచారం. గతంలో శ్రీనువైట్ల చేసిన సినిమాల్లో సునీల్ కామిడి పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమాలో అలంటి ఒక రోల్ డిజైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమాలో కూడా సునీల్ నటించబోతున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన 2కంట్రీస్ సినిమా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.