“పుష్ప” నుంచి సునీల్ ని ఈ రేంజ్ లో ఊహించి ఉండరు.!

Published on Nov 7, 2021 10:08 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో సాంగ్ కానీ సినిమాలోని ఒక్కొక్కరి పత్రానికి రివీల్ చేస్తూ మరింత హైప్ తెస్తున్నారు. గత కొన్నాళ్ల కితం సినిమాలో విలన్ ఫహద్ పాత్ర ని రివీల్ చెయ్యగా ఇప్పుడు సినిమాలో మరో సాలిడ్ విలన్ పాత్రలో నటిస్తున్న సునీల్ లుక్ ని చిత్ర యూనిట్ రివీల్ చేశారు.

మంగళం శ్రీను గా సునీల్ భయంకరంగా కనిపిస్తున్నాడు. సుకుమార్ సినిమాల్లో పాత్రలై ఎంత నాచురల్ గా హుందాగా ఉంటాయో దీనితో మరోసారి అర్ధం అవుతుంది. తన డ్రెస్సింగ్ కానీ రగ్గుడ్ లుక్ కానీ అసలు సునీల్ ఈ రేంజ్ లో ఉంటాడా అని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. మొత్తానికి మాత్రం సుకుమార్ ప్లానింగ్ అవుట్ స్టాండింగ్ అని చెప్పి తీరాలి. ఇక సినిమాలో సునీల్ భాష నడవడిక ఏ తీరుగా ఉంటాయో చూడాలి.

సంబంధిత సమాచారం :