కామెడి కింగ్స్ ఫ్రెండ్స్ అయ్యారు !
Published on Jan 3, 2018 11:04 am IST

అల్లరి నరేష్, భీమినేని శ్రీనివాసరావు కాంబినేషన్ అనగానే మనకు గుర్తు వచ్చే సినిమా ‘సుడిగాడు’. 2012 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతోంది.

జనవరి 12 న ప్రారంభం కానున్న ఈ సినిమాలో మరొక హీరో సునీల్ కూడా నటిస్తున్నాడు. నరేష్, సునీల్ ఇద్దరూ స్నేహితులుగా కనిపించబోతున్నారు. కామెడి ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు శ్రీ వసంత్ సంగీతం అందించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook