సెన్సార్ పూర్తి చేసుకున్న సునీల్ సినిమా !

సునీల్, మ‌నీషా రాజ్ హీరో హీరోయిన్స్ గా నటించిన చిత్రం ‘2 కంట్రీస్’. మలయాళంలో మంచి విజ‌యం సాధించిన‌ ‘2 కంట్రీస్’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహాలక్ష్మీ ఆర్ట్స్ ప‌తాకంపై ఎన్.శంకర్ ఈ సినిమాను నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీనివాస్ రెడ్డి, నరేష్ చేసిన కామెడి ఈ సినిమాకు ప్రధాన బలం కానుంది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని యు సర్టిఫికెట్ అందుకుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. గోపి సుందర్ సంగీతం అందించిన ఈ సినిమాను వినోధభరితంగా తెరకెక్కించారు. ఈ నెల చివర్లో సినిమాను విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ మూవీ తో సునీల్ హిట్ కొట్టడం ఖాయమని పరిశ్రమలోని టాక్.