“పుష్ప” సినిమా తర్వాత సునీల్ రేంజ్ మరింత పెరిగిపోయిందా..!

Published on May 28, 2022 2:59 am IST


కమెడీయన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలతో హిట్ కొట్టి ఆతర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. దాంతో విలక్షణమైన పాత్రలపై దృష్టిపెడుతూ ఆ దిశగా అడుగులు వేశాడు. అందులో భాగంగానే ఆ మధ్య వచ్చిన ‘కలర్ ఫోటో’, ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ పాత్రలకి మంచి క్రేజ్ వచ్చింది. దీంతో సునీల్‌కి బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్‌లు
బాగానే వస్తున్నాయట.

అయితే గతంలో హిందీ ఆఫర్లు వచ్చినా తన పాత్రకు పెద్ద ఇంపార్టెన్స్ లేకపోవడంతో నో అని చెప్పాడట. రీసెంట్‌గా విడుదలైన ఎఫ్ 3లో సునీల్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సందర్భంగా మరోసారి హిందీలో రెండు సినిమాలకు ఒకే చెప్పానని, అందులో ఒకటి విలన్‌గా, మరొకటి హీరో పక్కన ఉండే మెయిన్ కమెడీయన్ రోల్ అని సునీల్ చెప్పుకొచ్చాడు. ఒక్క హిందీ నుంచి మాత్రమే కాకుండా తమిళ్ నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని చెప్పుకొచ్చాడు సునీల్. ఏది ఏమైనా పుష్ప తర్వాత సునీల్ రేంజ్ బాగా పెరిగినట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :