హీరోగా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సునీల్..!

Published on May 22, 2022 3:01 am IST


కమెడీయన్‌గా కెరీర్ మొదలుపెట్టిన సునీల్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. అయితే హీరోగా ఒకటి రెండు సినిమాలతో హిట్ కొట్టిన్నా ఆ తర్వాత వరుస పరాజయాలను ఎదుర్కొంటూ వచ్చాడు. దాంతో విలక్షణమైన పాత్రలపై దృష్టిపెడుతూ ఆ దిశగా అడుగులు వేశాడు. అందులో భాగంగానే ఆ మధ్య వచ్చిన ‘కలర్ ఫోటో’, ఇటీవల వచ్చిన ‘పుష్ప’ సినిమాలో సునీల్ పాత్రలకి మంచి క్రేజ్ వచ్చింది. ఈ ఊపుతో మరోసారి హీరోగా మెప్పించేందుకు సునీల్ సిద్దమవుతున్నాడు.

త్వరలోనే ఎప్‌-3 సినిమాతో మరోసారి నవ్వించేందుకు రెడీ అయ్యాడు. ఈ చిత్రం ప్రమోషన్స్‌లో భాగంగా రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ త్వరలోనే తాను హీరోగా రీఎంట్రీ ఇస్తున్నానని ఓ మంచి ప్రాజెక్టుతో హీరోగా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించాడు.

సంబంధిత సమాచారం :