“వరల్డ్ ఆఫ్ గని” నుండి సునీల్ శెట్టి, ఉపేంద్ర ల క్యారెక్టర్స్ రివీల్!

Published on Nov 14, 2021 2:46 pm IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వం లో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం గని. రినైస్సన్స్ పిక్చర్స్ మరియు అల్లు బాబీ కంపనీ ల పై సిద్దు ముద్ద మరియు అల్లు బాబీ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ఈ చిత్రం లో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా సాయి మంజ్రేకర్ నటిస్తుంది. ఈ చిత్రం లో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ సునీల్ శెట్టి మరియు ఉపేంద్ర పాత్రలను పరిచయం చేస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం లో సునీల్ శెట్టి, ఉపేంద్ర లు విక్రమాదిత్య మరియు విజయేంద్ర సిన్హా పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన టీజర్ రేపు విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More