మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ ?

మహేష్ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ ?

Published on Jan 17, 2022 2:25 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్ మాజీ హీరో సునీల్ శెట్టి కనిపించబోతున్నాడు. నిజానికి ఈ పాత్రలో కన్నడ సీనియర్ హీరో వి. రవిచంద్రన్ నటించబోతున్నాడని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు సునీల్ శెట్టి పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఫిబ్రవరి నుంచి షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తరువాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే ఈ సినిమా పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించిబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు