‘సైరా నరసింహారెడ్డి’ లో మరొక తెలుగు హీరో !


మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ‘సైరా నరసింహారెడ్డి’ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ త్వరలోనే మొదలుకానుంది. భారీ బడ్జెట్ తో రూపొందింస్తున్న ఈ చిత్రంలో ఇప్పటికే అమితాబ్, నయనతార, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్లంతా నటిస్తుండగా ఇప్పుడు మరొక హీరో కూడా వాళ్ళ జాబితాలో చేరాడు.

అతనే చిరుకు వీరాభిమాని, కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సునీల్. ‘సైరా’ లో తానొక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నట్లు స్వయంగా తెలిపారట సునీల్. చిరు 150వ సినిమా ‘ఖైదీ నెం 150’ లో నటించాలని ఆశపడ్డ సునీల్ కు అప్ప్పుడు అవకాశం మిస్సైనా ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించే గొప్ప ఛాన్స్ లభించింది. సునీల్ గతంలో కూడా మెగాస్టార్ తో కలిసి ‘ఇంద్ర, ఠాగూర్, జై చిరంజీవ’ వంటి పలు సినిమాల్లో నటించాడు.