భారీ సినిమాలో నటిస్తున్న సునీల్ !
Published on Oct 25, 2017 2:57 pm IST

కమెడియన్ గా ఉన్నప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే సునీల్ హీరోగా మారాక కాస్త స్లో అయ్యారు. ప్రేక్షకులు సునీల్ ని హీరోగా కంటే కమెడియన్ గానే ఎక్కువ ఆదరించారు. హీరోగా తాను చేసున్న సినిమాలు కూడా పెద్దగా విజయం సాదించలేదు కనుక మళ్ళీ కామెడి పాత్రలు వేయడానికి ఇష్టపడుతున్నారాయన. తాజాగా సునీల్ త్రివిక్రమ్ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే త్రివిక్రమ్ & ఎన్టీఆర్ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరై విచ్చేసి క్లాప్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్య పాత్ర చెయ్యబోతున్నాడు. సునీల్, త్రివిక్రమ్ మధ్య ఉన్న అనుబంధంతో త్రివిక్రమ్ ఈ పాత్రని సునీల్ తో చేయిస్తున్నట్లు తెలుస్తోంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

 
Like us on Facebook