క్లైమాక్స్ షూట్‌లో సునీల్ కొత్త సినిమా

9th, August 2016 - 09:08:00 PM

sunil
కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే గత నెలాఖర్లో ‘జక్కన్న’ అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌కు ఒక హిట్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన వీలైనంత త్వరగా తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహె’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

దర్శకుడు వీరు పోట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ పూర్తి చేసుకుంటోంది. క్లైమాక్స్‌కు సంబంధించిన పలు యాక్షన్ ఎపిసోడ్స్ ఈ షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో సినిమా మొత్తం పూర్తి కానుందని టీమ్ తెలిపింది. సునీల్ సరసన సుష్మా రాజ్, రిచా పనాయ్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది.