యమా స్పీడు మీదున్న సునీల్
Published on Jul 29, 2017 5:03 pm IST


కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ కు మొదట్లో మంచి విజయాలు అందాయి. కానీ ఆ తరువాత సునీల్ కి సరైన సక్సెస్ దక్కలేదు. కానీ సునీల్ సినిమాలు మాత్రం స్పీడుగా పూర్తయిపోతున్నాయి. త్వరలో ఉంగరాల రాంబాబుగా సునీల్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్ శంకర్ దర్శకత్వం లో ఓ చిత్రాన్ని ప్రారంభించాడు.

కాగా ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఫిక్స్ కాలేదు. కానీ అప్పుడే షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం మలయాళం లో సూపర్ హిట్ అయిన ‘టూ కంట్రీస్’ కి రీమేక్ గా రాబోతోంది. ఏ చిత్రం లో మనీషా సునీల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

 
Like us on Facebook